WPL Final 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఢిల్లీ క్యాపిటల్స్

WPL Final 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఢిల్లీ క్యాపిటల్స్

WPL 2024: వుమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు టైటిల్ పోరులో తలపడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు టైటిల్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగాయి.  ఆదివారం( మార్చి 17) ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది.

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), సోఫీ డివైన్ , సబ్బినేని మేఘన, ఎల్లీస్ పెర్రీ, రిచా ఘోష్(కీపర్) , సోఫి మోలినెక్స్, జార్జియా వేర్ హామ్, శ్రేయాంకపాటిల్, ఆశాశోభన, శ్రద్ధా పోఖర్కర్, రేణుక. 

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: మెగ్ లానింగ్( కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజాన్కాప్, జెస్ జోనాస్సెన్ , రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా(వికెట్ కీపర్), శిఖాపాండే, మిన్ను మణి. 

ట్రోఫిని ఎవరు గెలుస్తారో తేల్చే  ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు పోటీ పడుతున్నాయి. ఆర్సీబీ ఫైనల్ కు చేరడం ఇదే తొలి సారి కాగా.. ఢిల్లీ ఫైనల్ చేరడం ఇది రెండోసారి. మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 8 గేమ్ లలో 6 మ్యాచుల్లో విజయం సాధించి 12 పాయింట్లతో లీగ్ లో అగ్రస్థానంలో ఉంది. వరుసగా 2వ సారి ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. 

స్మృతి మంధాన నేతృత్వంలోని బెంగళూరు జట్టలు 8 పాయింట్లతో 3 స్థానంలో నిలిచింది. లీగ్ రౌండ్ లో నిలకలేని ఆటతీరుతో ఆ జట్టు ఎలిమినేషన్ రౌండ్ లో 5 పరుగులు తేడాతో ముంబై ని ఓడించి ఫైనల్స్ లోకి ప్రవేశించింది. 

ఈ సీజన్ లో బెంగళూరులో జరిగిన లీగ్ గేమ్ లను వరుసగా 25 పరుగులు, ఒక పరుగుతో తేడాతో గెలుపొందిన ఢిల్లీ జట్టు గతేడాది ఫైనల్ లో ముంబై తో ఫైనల్ లో ఓడిపోయింది. ఈసారి ఎలాగైన టైటిల్ గెలవాలని చూస్తోంది. అదే సమయంలో ఢిల్లీతో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ లలో ఓట మికి ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు జట్టు భావిస్తోంది. 

ఇదిలా వుంటే ఐపీఎల్ గత 16 ఏళ్లలో రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఒక్కసారి కూడా ట్రోఫిని గెలవలేదు. కానీ మహిళా ప్రీమియర్ లీగ్ లో ఇరు జట్లు ట్రోఫీని కైవసం చేసుకునేందుకు హోరాహోరీగా తలపడతున్నాయి.