- ఉమ్మడి ఓరుగల్లులోని 6 జిల్లాల్లో 12 మున్సిపాలిటీలు
- మహిళా ఓటర్లు అత్యధికంగా 1,71,167
- పురుష ఓటర్లు 1,63,990., ఇతరులు 69 మంది
వరంగల్, వెలుగు: త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో మున్సిపాలిటీల్లో ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇటీవల అధికారులు ఓటర్ల ముసాయిదాను వెల్లడించారు. అందులో ప్రకటించిన ఓటర్ల జాబితాపై అభ్యంతరాలుంటే తెలపాలని కోరారు. మొత్తంగా గడువు ముగియడంతో అధికారులు సోమవారం తుది జాబితాను ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ లోని 6 జిల్లాల్లో 12 మున్సిపాలిటీల పరిధిలోని 260 వార్డుల్లో మొత్తం 3,35,226 మంది ఓటర్లు ఉన్నారు.
10 చోట్ల మహిళా ఓటర్లే అధికం..
ఉమ్మడి జిల్లా మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 12 మున్సిపాలిటీల పరిధిలోని 260 వార్డుల్లో మొత్తం 3,35,226 మంది ఓటర్లు ఉండగా, అందులో మహిళా ఓటర్లే అధికంగా 1,71,167 మంది ఉండగా, పురుష ఓటర్లు 1,63,990 మంది ఉన్నారు. 69 మంది ఇతరులున్నారు.
ఇందులోనూ 10 మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండగా, పరకాల, భూపాలపల్లిలో మాత్రం పురుష ఓటర్లు స్వల్పంగా అధికంగా ఉన్నారు. పరకాలలో మహిళా ఓటర్లు 12,937 మంది ఉండగా, పురుషులు మాత్రం 13,847 ఉన్నారు. భూపాలపల్లిలో మహిళలు 25,936 ఉంటే పురుష ఓటర్లు 26,786 మంది ఉన్నారు.
మహబూబాబాద్ ఎక్కువ.. వర్ధన్నపేట తక్కువ
12 మున్సిపాలిటీల్లో మహబూబాబాద్ అత్యధికంగా 36 వార్డులతో మేజర్ మున్సిపాలిటీ అనిపించుకోగా, వర్ధన్నపేట 12 వార్డులతో ఓరుగల్లులో చిన్న మున్సిపాలిటీగా ఉంది. ఓటర్లపరంగా చూస్తే కూడా మహబూబాబాద్‍లో అత్యధికంగా 65,712 మంది ఓటర్లు ఉండగా, వర్ధన్నపేటలో కేవలం 10,526 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.
మహబూబాబాద్ తర్వాత రెండో అతిపెద్ద మున్సిపాలిటీలుగా నర్సంపేట, జనగామ, భూపాలపల్లి 30 వార్డులతో ఉన్నాయి. 12 మున్సిపాలిటీల్లో జిల్లాల వారీగా చూస్తే మహబూబాబాద్‍లో 5 ఉండగా, వరంగల్, జనగామ జిల్లాల్లో 2 , హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 1 చొప్పున బల్దియా కేంద్రాలు ఉన్నాయి.
మున్సిపాలిటీల వారీగా వార్డులు, ఓటర్ల సంఖ్య..
మున్సిపాలిటీ వార్డులు పురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం
నర్సంపేట 30 19,642 21,323 03 40,968
వర్ధన్నపేట 12 5,109 5,416 01 10,526
పరకాల 22 13,847 12,937 _ 26,784
జనగామ 30 21,358 22,678 09 44,045
స్టేషన్ ఘన్‍పూర్ 18 8,913 9,636 01 18,550
భూపాలపల్లి 30 26,786 25,936 04 52,726
ములుగు 20 6,661 7,300 02 13,963
మహబూబాబాద్ 36 31,550 34,121 41 65,712
తొర్రూర్ 16 10,501 10,942 08 21,451
కేసముద్రం 16 7,754 8,191 _ 15,945
మరిపెడ 15 6,709 6,978 _ 13,687
డోర్నకల్ 15 5,160 5,709 _ 10,869
మొత్తం 260 1,63,990 1,71,167 69 3,35,226
