V6 News

ఎస్సై, ఏఎస్సై పరీక్షల తుది ఫలితాలు విడుదల

ఎస్సై, ఏఎస్సై పరీక్షల తుది ఫలితాలు విడుదల

హైదరాబాద్, వెలుగు:  ఎస్సై, ఏఎస్సై తుది రాత పరీక్షల ఫలితాలను తెలంగా ణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ శ్రీనివాసరావు ఆదివారం రిలీజ్​ చేశారు. వివిధ విభాగా లకు చెందిన 587 పోస్టులకు గాను పురుషులు 434, మహిళలు 153 మంది ని టీఎస్​ఎల్పీఆర్బీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఫైనల్ లిస్ట్​ను విడుదల చేసింది. మొత్తం 587 ఎస్సై, ఏఎస్సై పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా దాదా పు 2.47 లక్షల మంది పరీక్ష రాశారు. గతేడాది ఆగస్టు 7న ప్రాథమిక పరీక్ష తదుపరి ఎంపిక ప్రక్రియను నిర్వహించా రు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ లో అర్హత సాధించిన అభ్యర్థుల ప్రవర్తన, క్రిమినల్ కేసులపై టీఎస్ఎల్పీఆర్బీ ఆరా తీసింది.  సోమవారం టీఎస్ఎల్పీఆర్బీ వెబ్ సైట్ లో  కటాఫ్ మార్కులు, అభ్యర్థుల డేటాఫ్ బర్త్ తదితర వివరాలు వెల్లడిస్తామని బోర్డు చైర్మన్​ శ్రీనివాస్ రావు తెలిపారు.