హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఈడీ, బీపీఈడీ సహా పలు కోర్సులకు సంబంధించిన ఫీజులను సర్కారు ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో రిలీజ్ చేశారు. గతంలో కంటే ఈసారి కొన్ని కాలేజీల్లో స్వల్పంగా( రూ.3వేల నుంచి రూ.5వేల వరకు) ఫీజులు పెరిగాయి. రాష్ట్రంలోని 212 ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో అత్యధికంగా 47 వేలు ఉండగా, అత్యల్పంగా 16,500 ఫీజు ఫిక్స్ చేశారు. రూ.40వేలు, ఆపై ఫీజు కేవలం 7 కాలేజీల్లోనే ఉంది.
రాష్ట్రంలోని 16 ప్రైవేటు బీపీఈడీ కాలేజీల్లో అత్యధికంగా 2 కాలేజీల్లో 32వేలు ఉండగా, అత్యల్పంగా రూ.17వేలుగా ఫీజు నిర్ణయించారు. స్టేట్లో 8 ఎంఈడీ కాలేజీల్లో అత్యధికంగా రూ.40వేల ఫీజు ఉండగా, అత్యల్పంగా 10వేలుగా సర్కారు ఫీజు ఖరారు చేసింది.

