- స్టూడెంట్ల సంఖ్య 10 దాటిన స్కూళ్లకే
హైదరాబాద్, వెలుగు: ఎట్టకేలకు సర్కారు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు ట్యాబ్లు అందనున్నాయి. గతేడాది ఏప్రిల్లో జరిగిన 2022–23 ఎస్ఎస్ఏ కేంద్ర ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు(పీఏబీ)లో ఆమోదం తెలిపిన, వాటిని ఇప్పుడు సరఫరా చేస్తున్నారు. మార్చి1వ తేదీ నాటికి బడుల్లో ఉన్న అడ్మిషన్ల ఆధారం గా, ట్యాబ్లు సరఫరా చేయనున్నారు. అయితే ప్రతి స్కూల్కు ఇస్తామని చెప్పిన అధికారులు, స్టూ డెంట్ల సంఖ్య పది మంది కంటే ఎక్కువగా ఉన్న బడులకే అందిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 18,818 స్కూళ్లకు 19,800 ట్యాబ్లు ఇవ్వనున్నారు. వీటిలో 15,704 ప్రైమరీ స్కూళ్లకు 16,435 ట్యాబ్లు, 3,114 అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు 3,365 ట్యాబ్లు అందించనున్నారు. 165 స్టూడెంట్లు దాటిన స్కూళ్లకు రెండు ట్యాబ్లు ఇస్తున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 945 స్కూళ్లకు 1,058, సంగారెడ్డి జిల్లాలో 1,014, నల్లగొండ జిల్లాలో 975 స్కూళ్లకు 1,002 ట్యాబులు అందిస్తుండగా, అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లిలో 301 స్కూళ్లకు 303 ట్యాబ్లు ఇవ్వనున్నారు.
ఇప్పటికే జిల్లా కేంద్రాలకు ట్యాబ్లను పంపిస్తున్నారు. ట్యాబ్లు నిల్వ చేసేందుకు స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని డీఈవోలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధి కారులు సూచించారు. యూడైస్ డేటా, మిడ్డేమిల్స్ డేటా, మన ఊరు–మన బడి అప్డేట్ డేటా తదితర వివరాలను ప్రభుత్వానికి అందించేందుకు ట్యాబ్లు ఉపయోగపడతాయనీ వారు చెప్తున్నారు.
కేంద్రం 34,257కు అనుమతి ఇచ్చినా
కేంద్రం 34,257 ట్యాబ్లు ఇచ్చేందుకు అనుమతిం చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 20వేల ట్యాబ్లకే టెండర్లు పిలిచింది. ట్యాబ్ల రేట్ల కారణం చె ప్పి14,257 ట్యాబ్లను తగ్గించారు. 165 మంది స్టూడెంట్లున్న స్కూళ్లకు రెండు చొప్పున ట్యాబ్ లు ఇచ్చి, వెయ్యికి పైగా స్టూడెంట్లున్న స్కూల్కు కూడా రెండే ట్యాబులు ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
