ఆసియా రెజ్లర్ టీమ్లో అంతిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫంగటల్కు చోటు

ఆసియా రెజ్లర్ టీమ్లో  అంతిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫంగటల్కు చోటు

ట్రయల్స్‌‌‌‌‌‌‌‌ విషయంలో వినేశ్‌‌‌‌‌‌‌‌ను కోర్టుకు లాగిన అంతిమ్‌‌‌‌‌‌‌‌కు ఇప్పుడు అదృష్టం కలిసొచ్చింది. ఒకవేళ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఆమె మెడల్‌‌‌‌‌‌‌‌ నెగ్గితే.. ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఎందు కంటే వినేశ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్​ చాంపియన్​షిప్​ ట్రయల్స్‌‌‌‌‌‌‌‌లో కూడా ఆడటం లేదు. ఇక, అంతిమ్‌‌‌‌‌‌‌‌ను ఆసియా టీమ్‌‌‌‌‌‌‌‌లో చేర్చడంపై హర్యానాలోని సిసాయ్‌‌‌‌‌‌‌‌ ఖాప్‌‌‌‌‌‌‌‌ పంచాయత్‌‌‌‌‌‌‌‌ ఆనందాన్ని వ్యక్తం చేసింది. తన వెయిట్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో రిజర్వ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌కే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని వినేశ్‌‌‌‌‌‌‌‌ కూడా అధికారులను కోరింది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా విమెన్స్‌‌‌‌‌‌‌‌ 53 కేజీల్లో 19 ఏళ్ల అంతిమ్‌‌‌‌‌‌‌‌ బరిలోకి దిగడం ఖాయమైంది. 
జోర్డాన్‌‌‌‌‌‌‌‌లో జరిగిన అండర్‌‌‌‌‌‌‌‌–20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఈ యంగ్​స్టర్​ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఇక వీలైనంత త్వరగా గాయం నుంచి కోలుకుని మ్యాట్‌‌‌‌‌‌‌‌పైకి తిరిగి వస్తానని వినేశ్‌‌‌‌‌‌‌‌ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘నాకు మద్దతుగా నిలవాలని రెజ్లింగ్‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌, సపోర్టర్స్‌‌‌‌‌‌‌‌ను కోరుకుంటున్నా. దానివల్ల నేను మరింత బలంగా తయారవుతా. పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌కు ప్రిపేర్‌‌‌‌‌‌‌‌ అయ్యేందుకు మంచి టైమ్‌‌‌‌‌‌‌‌ దొరికింది. మీ అభిమానం, మద్దతు నాకు చాలా బలాన్నిస్తాయని నమ్ముతున్నా’ అని వినేశ్‌‌‌‌‌‌‌‌ ట్వీట్‌‌‌‌‌‌‌‌లో రాసుకొచ్చింది.