
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కడుపు నొప్పితో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. జ్వరం కూడా ఉండడంతో ఆమెను సోమవారం మధ్యాహ్నం ఎయిమ్స్‌లోని ప్రైవేట్ వార్డులో చేర్చారు. డాక్టర్లు మంత్రికి అన్ని టెస్టులు చేశారు. వాటి రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.