సెప్టెంబర్లో వీటికి ముగుస్తున్న గడువు..మిస్ చేస్తే భారీ మూల్యమే

సెప్టెంబర్లో వీటికి ముగుస్తున్న గడువు..మిస్ చేస్తే భారీ మూల్యమే

ఆగస్టు నెల ముగిసింది. సెప్టెంబర్ నెల వచ్చింది. ఈ క్రమంలో ఈ  సెప్టెంబర్ 2023 నుండి మన రోజు వారీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మన ఖర్చులపై సెప్టెంబర్ నెల ప్రభావాన్ని చూపుతుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి  ఏమేమి మారబోతోంది..ఏం చేస్తే లాభం..ఏం చేయకపోతే నష్టమో తెలుసుకుందాం. 

రూ. 2వేల నోట్ల మార్పిడి..

సెప్టెంబర్ లో అత్యంతముఖ్యమైనది..రూ. 2000 నోట్ల మార్పిడి.  కొన్ని రోజుల క్రితం రూ. 2000 నోట్లను ఆర్బీఐ  ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే రూ. 2000 ఈ నోట్లు ఉన్నవారు బ్యాంకుల్లో  మార్చుకునేందుకు లేదా అకౌంట్లలో డిపాజిట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు.  సెప్టెంబర్ 30  తర్వాత రూ. 2 వేల నోట్లు చెల్లని కాగితాలే అవుతాయి. కాబట్టి రూ. 2,000 నోట్లు ఎవరి వద్ద ఉన్నా సెప్టెంబర్ 30 లోగా వాటిని మార్చుకోవాలి. లేదా డిపాజిట్ చేసుకోవాలి.

చిన్నపొదుపు పథకాలకు ఆధార్

కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టినవారు  కేవైసీ కోసం ఆధార్ నంబర్ ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ఈ ఏడాది మార్చి 31న నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ఆధార్ నంబర్ అప్డేట్ చేయించుకోని వారి ఖాతాలను అక్టోబర్ 1 నుంచి ఫ్రీజ్ అవనున్నాయి.

 ఆధార్ కార్డు ఫ్రీ అప్‌డేట్..

మీ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ నెల చివరి అవకాశం.  UIDAI సెప్టెంబర్ 14 వరకు ఆధార్ ఉచిత  అప్‌డేట్‌లను అందించింది.  గతంలో జూన్ వరకు ఉచితంగా ఆధార్ ను అప్ డేట్ చేసుకునే  సదుపాయం అందుబాటులో ఉండేది. అయితే సెప్టెంబర్ 14 తర్వాత ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి చార్జీ వసూలు చేస్తారు. 

డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లకు నామినేషన్

ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ ఉన్నవారు కచ్చితంగా నామినీ వివరాలు సమర్పించాలి. అయితే నామినీ వివరాల సమర్పణకు సెబీ 2022 మార్చిలో నోటిఫికేషన్ జారీ చేసింది. 2023  మార్చి వరకు గడువు ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

ALSO READ:మళయాళ నటి అపర్ణ పి.నాయర్ అనుమానాస్పద మృతి.. చంపారా.. చనిపోయిందా..?


యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డు కండీషన్స్ లో మార్పులు

ఏడాది  ఫీజును రూ. 10 వేలు, అదనంగా జీఎస్టీని రూ. 12,500, ప్లస్ జీఎస్టీకి పెంచుతున్నట్లు యాక్సిస్ బ్యాంక్ కొద్ది రోజుల క్రితమే సర్క్యూలర్ జారీ చేసింది. ఇకపై వార్షిక ఫీజులో రూ. 10 వేల డిస్కౌంట్ ఓచర్ ఉండదని యాక్సిస్ బ్యాంకు తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చింది. 

ఎస్బీఐ వీకేర్ ఎఫ్డీ ఫర్ సీనియర్ సిటిజన్స్

SBI వీ కేర్ పేరుతో సీనియర్ సిటిజన్లకు అందిస్తున్న ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకం గడువును సెప్టెంబర్ 30 వరకు పెంచింది.  ఈ స్కీంలో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల టెన్యూర్ ఎఫ్డీలకు సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటును SBI ఆఫర్ చేస్తోంది. 

IDBI అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ

IDBI స్పెషల్ ఎఫ్డీ స్కీం అమృత్ మహోత్సవ్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ స్కీం ద్వారా 7.1 శాతం నుంచి 7.65 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది.  సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డే రేటు ఉంది.