ఝరాసంగం, వెలుగు : ఆర్థిక ఇబ్బందుల కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బొందిలి ప్రతాప్‌సింగ్ (60), కళావతి (50) దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. వీరంతా కేతకీ సంగమేశ్వర ఆలయం ముందు హోటల్ నడుపుతూ జీవిస్తున్నారు. కొన్ని నెలలుగా హోటల్ సరిగా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో మనస్తాపానికి గురైన ప్రతాప్‌సింగ్, కళావతి ఆదివారం సాయంత్రం తమ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగారు. చుట్టుపక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పొలం వద్దకు వెళ్లే సరికే ఇద్దరూ స్పృహ తప్పి పడిపోయి కనిపించారు. వెంటనే 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. మృతుడి తమ్ముడు సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఘటన
- మెదక్
- October 21, 2024
లేటెస్ట్
- MLC Kavitha: ఎనిమిది బీజేపీ ఎంపీలున్నరు..ఒక్కరూ విభజన చట్టంపై మాట్లాడలే.. ఎమ్మెల్సీ కవిత ఫైర్
- భరణి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు
- One Nation One Election: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లు క్రూరమైనది.. రాష్ట్రాల గొంతు చంపేయటమే : సీఎం స్టాలిన్
- గడప దాటని ‘తెలంగాణ’పత్రిక: ముద్రించి మూలకేస్తున్న I & PR
- World Chess Championship 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత గుకేష్
- Allu Arjun: మొన్న సీఎం పేరు... ఇప్పుడు సుకుమార్ పేరు మర్చిపోయాడంటూ అల్లు అర్జున్ పై ట్రోలింగ్..
- మామల బాటలోనే బన్నీ..? అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై టీం క్లారిటీ
- మీడియాపై దాడి.. ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
- Hyderabad Dishesh:ప్రపంచం మెచ్చిన ఫుడ్‌లో..హైదరాబాద్ బిర్యానీ..తినరా మైమరిచి..లొట్టలేసుకుంటూ
- Niroshan Dickwella: నిర్దోషి అని నిరూపించుకున్నాడు: శ్రీలంక క్రికెటర్‌పై నిషేధం ఎత్తివేత
Most Read News
- Sobhita Naga Chaitanya:పెళ్లైన తర్వాత కొత్త జంట చైతూ, శోభిత అటెండ్ అయిన మొదటి పెళ్లి వీళ్లదే
- Beauty Tip : జుట్టు ఎడాపెడా రాలిపోతుందా..? బలమైన జుట్టుకు ఈ చిట్కాలు పాటించండి..!
- Flipkart cancellation fee: ఆర్డర్ క్యాన్సలేషన్ ఫీజుపై క్లారిటీ ఇచ్చిన ఫ్లిప్ కార్ట్
- తిరుపతిలో దారుణం: బస్సుతో ఉడాయించిన డ్రైవర్.. రోడ్డున పడ్డ 35 మంది అయ్యప్ప భక్తులు.
- UPSC Mains 2024 :యూపీఎస్సీ మెయిన్స్‌లో తెలంగాణ నుంచి 20 మంది క్వాలిఫై
- Bigg Boss: విన్నర్‌కు ట్రోఫీ.. బిగ్ బాస్ తెలుగు8 గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!
- ఆర్టీసీ బస్సుల్లో ఇక ఆన్ లైన్ చెల్లింపులు
- అతుల్ సుభాష్ పరిస్థితి మరొకరికి రాకూడదని.. సుప్రీం కోర్టు 8 మార్గదర్శకాలివే..
- Good Health : పిల్లల్లో రోజురోజుకు తగ్గుతున్న ప్రొటీన్లు.. ఇవి తింటే బలంగా తయారవుతారు..!
- Sai Pallavi: ఇంక ఊరుకోను.. వారిని కోర్టు మెట్లెక్కిస్తా.. సాయి పల్లవి మాస్ వార్నింగ్