
హిందూ మతంలో పూజలకు చాలా పెద్దపీట వేస్తారు. ఏ కష్టం వచ్చినా.. ఎలాంటి ఇబ్బందులు వచ్చిన పండితులను సంప్రదిస్తుంటారు. హిందూ మతంలో అరటి చెట్టుకు .. కొబ్బరి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. మండపాలు ఏర్పాటు చేసి పూజలు చేసేటప్పుడు.. కొబ్బరి ఆకులు... అరటి చెట్లు మండపానికి నాలుగు పక్కల కడతారు. ఇక అయ్యప్ప స్వామి పడి పూజల్లో అరటి దొప్పలతో పడి తయారు చేస్తారు. పుణ్య నదుల్లో దీపాలు వదిలేటప్పుడు.. అరటిదొప్పల్లో వదులుతారు. ఇలా అరటి దొప్పల్లో దీపాలు వదిలితే ఆర్థిక కష్టాలు తీరతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.
అరటి చెట్టులో విష్ణుమూర్తి.. లక్ష్మీదేవి నివసిస్తారని విష్ఫుపునాఫం ద్వారా తెలుస్తుంది. అరటి చెట్టు చరిత్రను పరిశీలిస్తే దేవ గురువు బృహస్పతికి సంబంధించినది అని చెబుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి... అదృష్టం.. శ్రేయస్సుకు అధిపతి. . గురువారం నాడు అరటి చెట్టును పూజించడం వలన ఇది గురు బృహస్పతి సంతోషించి .... ఆర్థిక ఇబ్బందులను నెరవేరుస్తాడని చెబుతారు.
Also Read :తెలంగాణ తొలి విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న
అరటి చెట్టుకు ఏడాదికి ఒక గెల మాత్రమే కాస్తుంది. అరటి ఆకులను పూజలలో వాడతారు. వివాహాలు.. ఆచారాలకు .. సంబంధించి అరటి చెట్టును.. అరటి ఆకులను ఉపయోగిస్తారు. పండితులు తెలిపిన వివరాల ప్రకారంగా .. ఆర్థికంగా ఒడిదుడుకులు.. సమస్యలు తరచుగా వస్తుంటే .. అరటి చెట్టుకు పూజచేసి.. విష్ణుసహస్రనామం చదువుతూ 11 సార్లు ప్రదక్షిణలు చేయాలి. అరటి చెట్టుకు నైవూద్యంగా బెల్లం .. శనగపప్పు సమర్పించాలి. ఆ తరువాత వీటిని జాకెట్ పీస్ లో పసుపు కలిపి దానిని ముడివేసి అరటి చెట్టుకు కట్టాలి. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అరటి పండ్లను వేళ్లను కట్టడం చాలా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. ఇలా కట్టడం వలన లక్ష్మీ దేవి ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ఉన్న ప్రతికూలతలు తొలగిపోతాయాని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
గురువారం నాడు అరటి చెట్టును పూజించడం వల్ల ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. గురువారం నాడు అరటి చెట్టుకు నీరు, పసుపు, పూలు, ధూపం వేసి పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం వస్తుందని పురాణాల్లో ఉందని పండితులు చెబుతున్నారు. ఇంకా అరటి చెట్టు వేర్లను గంగా జలంతో కడిగి పసుపు దారంతో కట్టి, భద్రపరిచే స్థలంలో లేదా డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతుంటారు.