
హైదరాబాద్, వెలుగు: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శిల్పం, చిత్రలేఖనం శాఖ ఆధ్వర్యంలో సమ్మర్కోచింగ్క్లాసులు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భట్టు రమేశ్తెలిపారు. పెయింటింగ్, శిల్పం, ప్రింట్ మేకింగ్ కోర్సుల్లో 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల 8 నుంచి క్లాసులు మొదలవుతాయని, ఆసక్తి గల స్టూడెంట్లు రూ.6వేలు ఫీజు చెల్లించి జాయిన్అవ్వొచ్చని, కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్ఇస్తామని స్పష్టం చేశారు. ఫీజు డీడీని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్పేరిట చెల్లించాలని సూచించారు. వివరాలకు 83090 11865, 83094 98807 నంబర్లలో సంప్రదించొచ్చని చెప్పారు.