నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌,  గూగుల్‌‌పై ఫైన్‌‌

నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌,  గూగుల్‌‌పై ఫైన్‌‌

న్యూఢిల్లీ: యూజర్లు తమ ఓటీటీ మెంబర్‌‌‌‌షిప్‌‌లను క్యాన్సిల్‌‌ చేసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో నెట్‌‌ఫ్లిక్స్, గూగుల్‌‌ (యూటూబ్‌‌) వంటి ఐదు ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌‌లపై  రూ. 13 లక్షల ఫైన్‌‌ను సౌత్‌‌ కొరియా ఫెయిర్‌‌‌‌ ట్రేడ్‌‌ కమీషన్‌‌ (ఎఫ్‌‌టీసీ) విధించింది.  నెట్‌‌ఫ్లిక్స్‌‌, గూగుల్‌‌, కేటీ, ఎల్‌‌జీ ఉప్లస్‌‌, కంటెంట్ వేవ్‌‌లకు కంబైన్డ్‌‌గా ఈ ఫైన్ వేసింది. యూజర్లకు తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా వారి మెంబర్షిప్‌‌ను క్యాన్సిల్ చేసుకోవడానికి అనుమతివ్వకపోవడం వంటి కారణాలతో ఈ ఫైన్‌‌ వేశామని ఎఫ్‌‌టీసీ ప్రకటించింది. తమ బిజినెస్ పద్ధతులను మార్చుకోవాలని ఆదేశించింది.  కాగా, ఒక సర్వే ప్రకారం, 34 శాతం మంది సౌత్‌‌ కొరియన్లు ఓటీటీ లేదా వీడియో స్ట్రీమింగ్ పెయిడ్ సర్వీస్‌‌లను వాడుతున్నారు.