అత్యాచారం, బెదిరింపుల ఆరోపణలు..ఎమ్మెల్యేపై కేసు నమోదు

అత్యాచారం, బెదిరింపుల ఆరోపణలు..ఎమ్మెల్యేపై కేసు నమోదు

అత్యాచారం, బెదిరింపులు ఆరోపణలతో కేరళలోని పాలక్కాడ్ ఎమ్మెల్యేపై కేసు శుక్రవారం (నవంబర్ 28) నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని , మోసం చేసి గర్భవతిని చేసి వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్ కూటథిల్ పై కేరళ పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. గురువారం (నవంబర్ 27) సచివాలయంలో సీఎం పినరయి విజయన్ ని కలిసి బాధిత మహిళ, ఆమె కుటుంబ సభ్యులు.. ఎమ్మెల్యే రాహుల్ పై ఫిర్యాదు చేయడంతో  పోలీసులు కేసును వేగవంతం చేశారు.

అత్యాచారం, మోసం చేసి లైంగికంగా లొంగదీసుకోవడం,  పెళ్లి చేసుకుంటానని నమ్మించి  గర్భవతిని చేయడం ఆ త్వర్వాత అబార్షన్ కోసం బలవంతం చేయడం వంటి ఆరోపణలతో బాధితుల ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

పార్టీ సస్పెన్షన్

లైంగిక ఆరోపణలకు సంబంధించిన వాయిస్ క్లిప్ లు, టెక్ట్ మేసేజ్ లు సోషల్  మీడియాలో వైరల్ కావడంతో ఆగస్టులో ఎమ్మెల్యే రాముల్ మమ్ కూటథిల్ ను కాంగ్రెస్ పార్టీనుంచి సస్పెండ్ చేశారు.  పార్టీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి కూడా  మమ్‌కూటథిల్‌ను తొలగించింది.