
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కర్నాటకలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెంట్, రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ ఫండ్ (పీఎం కేర్స్ ఫండ్) విషయంలో ప్రధాని మోదీని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ చేసిన ట్వీట్ కు గాను శివమొగ్గ జిల్లా కోర్టులో ఎఫ్ ఐఆర్ రిజిస్టర్ అయింది. కేవీ ప్రవీణ్అనే న్యాయవాది ఈ కంప్లయింట్ చేశాడు. ఈ నెల 11న పీఎం కేర్స్ ఫండ్ పై నిరాధార ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ట్విటర్ హ్యాండిల్ లో పోస్ట్ చేయడంపై కేసు ఫైల్ అయింది. పీఎం కేర్ ఫండ్ నిధులను ప్రజల కోసం వాడట్లేదని కాంగ్రెస్ ట్వీట్ చేసినట్లు పిటిషనర్ ప్రవీణ్ పేర్కొన్నారు. ‘పీఎం కేర్ ఫండ్ తో ప్రధాని మోదీ ఫారెన్ టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుట్టిస్తున్న రూమర్లు. అందుకే నేను కంప్లయింట్ ఫైల్ చేశా’ అని ప్రవీణ్ చెప్పారు.