
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై చత్తీస్‌గఢ్‌లో కేసు నమోదైంది. ఇటీవల ఆమె బెంగాల్‌లోని నదియా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘బార్డర్ సెక్యూరిటీ కేంద్ర హోంశాఖ బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫెయిల్ అయ్యారు.
మన దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న బంగ్లాదేశీయులను అడ్డుకోలేకపోయారు. పైగా చొరబాట్లకు టీఎంసీ సర్కార్‌దే బాధ్యత అంటూ బద్నాం చేస్తున్నారు. చొరబాట్లను అడ్డుకోలేకపోయిన అమిత్ షా తలను నరకాలి” అని అన్నారు. ఈ కామెంట్లపై చత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌కు చెందిన గోపాల్ సమంతో అనే వ్యక్తి మొయిత్రాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.