బెంగళూరు ఏరో షోలో ప్రమాదం..100 కార్లు దగ్ధం

బెంగళూరు ఏరో షోలో ప్రమాదం..100 కార్లు దగ్ధం

కర్ణాటక : బెంగళూరు ఎయిర్ షో నిర్వహిస్తున్న ప్రాంగణంలో భారీ ప్రమాదం జరిగింది. కార్ పార్కింగ్ ఏరియాలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దాదాపు వంద కార్లు మంటలకు ఆహుతి అయ్యాయి.

గేట్ నంబర్ 5 దగ్గర ఓ కారులో మంటలు ఎగసిపడ్డాయని ప్రాథమిక సమాచారం తెలుస్తోంది. ఈ మంటలు పక్కనున్న కార్లకు అంటుకున్నాయి. వరుసగా కార్లు పార్క్ చేసి ఉండటంతో… వెంటవెంటనే మంటలు అన్ని కార్లకు అంటుకున్నాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 100 కార్లు, పదుల సంఖ్యలో టూ వీలర్లు మంటల్లో కాలిపోయాయని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.