ఎర్నాకులంలో అగ్ని ప్రమాదం

ఎర్నాకులంలో అగ్ని ప్రమాదం

కేరళ ఎర్నాకులం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం పెరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడక్కవు దేవి గుడిలో నిన్న సంప్రదాయ ఉత్సవాలు నిర్వహించారు. దీనిలో భాగంగా.. నిన్న రాత్రి భారీస్థాయిలో క్రాకర్స్ పేల్చారు. అన్ని క్రాకర్స్ ఒకేసారి పేలడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. వేడుక చూస్తున్న భక్తులపై క్రాకర్స్ పడ్డాయి. ఈ ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు.58 ఏళ్ల విమల అనే మహిళకు మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను.. వెంటనే హాస్పిటల్ లో చేర్పించారు. పదకొండేళ్ల చిన్నారి కూడా ఉంది. ఈ సంఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు…
ముస్లిం మహిళలు మసీదులో ప్రార్థనలు చేయవచ్చు
CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉందా?
పెట్రోల్ ధర పెంచిన జగన్ ప్రభుత్వం