
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని సంజీవయ్య పార్క్ లో అగ్ని ప్రమాదం జరిగింది. చెత్తలో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో అక్కడున్న వారంత పరుగులు పెట్టారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాని పార్క్ లో ఉన్న కొన్ని చెట్లు కాలిపోయాయి. పార్క్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.