
ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్2లో అగ్ని ప్రమాదం జరిగింది.లాడిల్ తెగడంతో ఉక్కు నేలపై పడింది. ఉక్కు పడిన చోట ఆయిల్ ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తలించారు.