వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 17వ తేదీ శనివారం మధ్యహ్నం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని సీపీపీ-3లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో ఘటనాస్థలంలో దట్టంగా పొగ అలుముకుంది.  సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్యాపిటివ్ పవర్ ప్లాంట్ లో తప్పిదం కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.