
ఎల్బీనగర్, వెలుగు: మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి గణేష్ నగర్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా లారీ మెకానిక్, గ్యాస్ వెల్డింగ్, పెయింటింగ్ షాపులో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే షాపులోని పరికరాలు పూర్తిగా దగ్ధమై, సుమారు రూ.60 వేల నష్టం వాటిల్లినట్లు పోలీసులు అంచనా వేశారు.