Kalyan Ram: హీరో కళ్యాణ్ రామ్ మూవీ సెట్లో అగ్నిప్రమాదం.. రూ.4 కోట్ల నష్టం

Kalyan Ram: హీరో కళ్యాణ్ రామ్ మూవీ సెట్లో అగ్నిప్రమాదం.. రూ.4 కోట్ల నష్టం

నందమూరి కళ్యాణ్‌ రామ్‌(Kalyan Ram) సినిమా షూటింగ్ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు రూ.4 కోట్ల నష్టం జరిగిందని తెలుస్తోంది. సినిమాలో ప్రతేకమైన సన్నివేశం కోసం వేసిన భారీ సెట్ లో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..  నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరితో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కూడా కీ రోల్ చేస్తున్నారని సమాచారం. 

ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో సీబీఐకి సంబందించిన సన్నివేశాలు కీలకం కాబోతున్నాయట. దానికోసం ప్రత్యేకంగా సిబిఐ ఆఫీస్ సెట్‌ వేయించారట మేకర్స్. మొత్తం పది రోజుల పాటు ఆ సెట్‌లో షూటింగ్ జరగాల్సి ఉండగా.. మరో రోజు షూటింగ్ మిగిలి ఉండాగానే ఈ అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం. 

ఇటీవల ఈ సీట్ లో షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత ఈ అగ్ని ప్రమాదం జరిగిందట. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరుగగా.. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించేలోపే సెట్‌ మొత్తం కాలి బూడిదైపోయిందట. ఈ సెట్ కాలిపోవడం వల్ల మేకర్స్ దాదాపు రూ.4 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.