ఈస్ట్ లండన్ లో భారీ అగ్ని ప్రమాదం

ఈస్ట్ లండన్ లో భారీ అగ్ని ప్రమాదం

ఈస్ట్  లండన్ లోని ఓ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డిపాస్ గార్డెన్స్ కు దగ్గర లో ఉన్న లగ్జరీ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్టు తెలిపారు స్థానికులు. దీంతో 15 ఫైర్ ఇంజన్ లు, 100 మంది ఫైర్ మెన్ లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. బిల్డింగ్ లో నివసిస్తున్న వారిని సురక్షితంగా తరలించామని తెలిపారు ఫైర్ సిబ్బంది. అయితే ఇంకెవరైనా గాయపడ్డారా అని తెలియాల్సి ఉందని చెప్పారు అధికారులు. మంటలు గ్రౌండ్ ఫోర్ నుంచి ఆరో ఫ్టోర్ వరకు వ్యాపించినట్టుగా తెలిపారు.