
- వేస్ట్ మేనేజ్‌నెంట్ కంపెనీలో చెలరేగిన మంటలు
- షెడ్డు, రెండు వాహనాలు దగ్ధం
పటాన్‌చెరు, వెలుగు : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఉన్న ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే క్రమంలో షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న ఓ లారీకి అంటుకోగా.. రెండు వాహనాలను కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఇదే ప్రాంతంలోని సిగాచి పరిశ్రమలో ఇటీవల జరిగిన ప్రమాదం మరువకముందే మరోఘటనతో ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు మొదలు పెట్టారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమా ? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోమంలో విచారణ చేస్తున్నారు.