ప్రధాని మోడీ ఇంట్లో అగ్ని ప్రమాదం

ప్రధాని మోడీ ఇంట్లో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాసంలో చిన్నపాటి అగ్ని ప్రమాదం జరిగింది. ఆయన అధికార నివాసమైన 9, లోక్ కల్యాణ్ మార్గ్‌ కాంప్లెక్స్‌లో సోమవారం రాత్రి 7.25 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో తొమ్మిది ఫైరింజన్లు హుటాహుటీన అక్కడికి చేరుకున్నాయి. 7.55 గంటల కల్లా ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేసినట్లు అధికారులు తెలిపారు.

ఇన్వర్టర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన మంత్రి కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా  వెల్లడించింది. అయితే ప్రమాదం జరిగింది.. ప్రధాని ఇంటి ఆవరణ లోపల గానీ, ఆయన కార్యాలయంలో గానీ కాదని తెలిపింది. ప్రధాని మోడీకి భద్రత కల్పించే ఎస్పీజీ బలగాల రిసెప్షన్ ప్రాంతం (లోక్ కల్యాణ్ మార్గ్ కాంప్లెక్స్)లో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని పీఎంవో ట్వీట్ చేసింది.