
- ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ విభాగం ప్రకటన
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ సిటీలపై రష్యన్ ఆర్మీ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో గురువారం అర్ధరాత్రి ఎనెర్గోడర్ లోని జపోరిజియా అణు విద్యుత్ కేంద్రంపై రష్యా బాంబులు వేసింది. దీంతో యూరప్ లోనే అతి పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయిన దీనిపై రష్యా అటాక్స్ తో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో న్యూక్లియర్ ప్లాంట్ లో పేలుడు జరిగితే భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుందని, ఆ మంటల ఆర్పేందుకు ఫైర్ సిబ్బందిని వెళ్లనివ్వాలని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డిమిత్రో కులెబా రష్యాను కోరారు. దీంతో రష్యన్ బలగాలు ఆ ప్రాంతాలో దాడులను నిలిపేయడంతో ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది న్యూక్లియర్ ప్లాంట్ లోకి వెళ్లి మంటలను ఆర్పేశారు. రష్యా దాడులతో న్యూక్లియర్ ప్లాంట్ లోని ట్రైనింగ్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయని, వాటిని ఈ రోజు ఉదయం ఆర్పామని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ విభాగం వెల్లడించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపింది.