కరీంనగర్: కరీంనగర్లో మూతపడిన తిరుమల థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే చేశారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా థియేటర్లోని సీట్లకు నిప్పంటించినట్లు అధికారులు గుర్తించారు.
దాదాపు 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. మంటలు ఆర్పి కేసు నమోదు చేసి ఫైర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మూత పడిన థియేటర్కు ఇన్సూరెన్స్ పొందేందుకే ఇలా చేశారని స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
