అందోల్ మండలంలో పటాకుల గోదాం వద్ద అగ్నిప్రమాదం

అందోల్ మండలంలో పటాకుల గోదాం వద్ద అగ్నిప్రమాదం

జోగిపేట, వెలుగు: అందోల్ ​మండలం సంగుపేట గ్రామ శివారులోని కటుకం వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్ సేల్ అండ్ రిటైల్ టపాసుల గోదాం దగ్గర శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాం ముందు పటాకుల షాప్​ఏర్పాటు చేసి విక్రయిస్తుండగా కౌంటర్​ ముందు ఉన్న విద్యుత్​మీటర్​ వద్ద షార్ట్​ సర్క్యూట్​ కావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో గోదాం ముందు విక్రయానికి ఉంచిన పటాకులన్నీ కాలిపోయాయి. 

పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కొనుగోలుదారులు భయంలో బయటకు పరుగులు తీశారు. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి నాగేశ్వర్​రావు సంఘటనా స్థలాన్ని  సందర్శించారు. జోగిపేట ఫైర్​ఆఫీసర్​ శ్రీనివాస్​గౌడ్​ ఆధ్వర్యంలో మంటలను ఆర్పారు. గోదాంకు ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడ్డారు. ఘటనా స్థలాన్ని తహసీల్దార్​మధుకర్​రెడ్డి సందర్శించి పెద్ద మొత్తంలో సరుకు కాలిపోయిందని అంచనా వేశారు. సరైన సేఫ్టీ ప్రికాషన్స్​ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెప్పారు.