కాటేదాన్ లో మరో అగ్ని ప్రమాదం.. భయాందోళనలో ప్రజలు

కాటేదాన్ లో మరో అగ్ని ప్రమాదం.. భయాందోళనలో ప్రజలు

గ్రేటర్ హైదరాబాద్  పరిధిలో అగ్ని ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితమే కాటేదాన్ లోని ఓ పరుపుల గోదాంలో అగ్నిప్రమాదం జరగగా.. లేటెస్ట్ గా ఇవాళ  కాటేదాన్ పారిశ్రామిక వాడలో, మల్కాజ్ గిరి పరిధిలోని ఓ గోదాంలో అగ్ని ప్రమాదాలు జరిగాయి   

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పరిధిలోని  సాయిబాబా నగర్ లోని విమల్ ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించాయి.   ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది   రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై  ఆరాదీస్తున్నారు. పరిశ్రమకు  ఎలాంటి అనుమతులు లేవని చెబుతున్నారు పోలీసులు.

మరో వైపు మల్కాజ్ గిరి పరిధిలోని ఆర్టీసీ కాలనీలో  ఫినాయిల్ గోడౌన్ లో  ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దాలతో మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.  ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు