కీసర: సిలిండర్ లీకేజీతో హోటల్ లో మంటలు

కీసర: సిలిండర్ లీకేజీతో హోటల్ లో మంటలు

కీసర, వెలుగు: కీసర- ఈసీఐఎల్‌ ప్రధాన రహదారిపై ఉన్న సరవణ సుప్రభాత్‌ హోటల్‌లో గురువారం తెల్లవారుజామున సిలిండర్‌ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం వినిపించి మంటలు చెలరేగడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

జేసీ ఆటోమొబైల్స్‌ షోరూం సిబ్బంది, స్థానికులు మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఆస్తి నష్టం అంచనా వేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.