హైదరాబాద్ అల్వాల్ లోని ఓ వసతి గృహంలో అగ్నిప్రమాదం జరిగింది. అల్వాల్ హై టెన్షన్ లైన్ లో బాలికల వసతి గృహంలో జనవరి 25న తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. 4వ అంతస్తులో ఉన్న గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వసతి గృహంలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
నైన్ ఎడ్యుకేషన్ వసతి గృహంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున పొగ ఆవరించడంతో కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నట్లు అగ్ని మాపక అధికారులు తెలిపారు. ఘటనాస్థలీకి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది పంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
