యువ డాక్టర్లకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి : నిమ్స్ సీవీటీఎస్ హెచ్ఓడీ డాక్టర్ ఎం. అమరేశ్ రావు

యువ డాక్టర్లకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి : నిమ్స్ సీవీటీఎస్ హెచ్ఓడీ డాక్టర్ ఎం. అమరేశ్ రావు
  •     థియరీ చదువులకు.. ఆపరేషన్ థియేటర్ అనుభవం తోడవ్వాలి 
  •     యంగ్ డాక్టర్లకు నిమ్స్ సీవీటీఎస్ హెడ్ డాక్టర్ అమరేశ్ రావు సూచన 
  •     నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సీవీటీఎస్ బూట్ క్యాంప్-2026 ప్రారంభం 

హైదరాబాద్, వెలుగు: పుస్తకాల్లోని పాఠాలను ప్రాక్టికల్ నైపుణ్యాలతో జోడించినప్పుడే వైద్య రంగంలో రాణించగలరని, తద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించవచ్చని యువ డాక్టర్లకు నిమ్స్ సీవీటీఎస్ హెచ్ఓడీ డాక్టర్ ఎం. అమరేశ్ రావు సూచించారు. శనివారం నిమ్స్ హాస్పిటల్ లో కార్డియోథొరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సీవీటీఎస్ బూట్ క్యాంప్–2026ను ప్రారంభించారు. కార్యక్రమానికి నిజాం మనవడు నజాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గఢ్ నవాబ్ అలీఖాన్, లక్నో ఇంటెగ్రల్ వర్సిటీ డీన్ డాక్టర్ ఆభా చంద్ర చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా డాక్టర్ అమరేశ్ రావు మాట్లాడుతూ.. ‘‘కేవలం అకడమిక్ జ్ఞానం ఉంటే సరిపోదు. యువ సర్జన్లకు, ట్రైనీలకు వాస్తవ శస్త్రచికిత్స అనుభవం చాలా అవసరం. ఆధునిక పద్ధతులు, కొత్త టెక్నాలజీపై లోతైన అవగాహన కల్పించేందుకే ఈ బూట్ క్యాంప్ ఏర్పాటు చేశాం. ఇక్కడ నేర్చుకున్న మెళకువలు భవిష్యత్తులో అద్భుతమైన వైద్యం అందించడానికి దోహదపడతాయి’’ అని తెలిపారు. 

నిమ్స్​లో ఇంటర్నేషనల్ ట్రైనింగ్: డైరెక్టర్ బీరప్ప 

నిమ్స్ లాంటి ప్రభుత్వ వైద్య సంస్థలో ఇలాంటి హై-క్వాలిటీ అకడమిక్ బూట్ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లు నిర్వహించడం చాలా గొప్ప విషయమని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. బీరప్ప అన్నారు. దీనివల్ల మన యువ డాక్టర్లకు లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గానే అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందుతున్నాయని చెప్పారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను మరింత ఎక్కువగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 

కాగా, ‘రీసెట్, రీ-ఇన్నోవేట్, రీఫైన్’ అనే థీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో జరిగిన ఈ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో దేశం నలుమూలల నుంచి ఎంబీబీఎస్ విద్యార్థులు, పీజీ డాక్టర్లు, యువ సర్జన్లు కలుపుకుని సుమారు350 మందికి పైగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నిమ్స్ డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.