సోమవారం (డిసెంబర్ 09) ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో రాజౌరీ గార్డెన్‌లోని జంగిల్ జంబోరీ రెస్టారెంట్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజన్లతో ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో రెస్టారెంట్‌లోని కస్టమర్లు ప్రాణాలు రక్షించుకునే చేసిన సాహసాలు నెట్టింట వైరల్‌గా మారాయి. తల్లిదండ్రులు తమ పిల్లలతో సహా గోడలు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. రెస్టారెంట్ బిల్డింగ్ నుండి పక్కనున్న బిల్డింగ్ మీదకు వారు దాటుతున్న వీడియోలు కలవరపరుస్తున్నాయి. ఏమాత్రం పట్టు తప్పిన చేదు వార్తే. అంత భయంకరమైన సాహసాలు చేశారు.
Fire at Rajouri garden,'s
— 💝🌹💖🇮🇳jaggirmRanbir🇮🇳💖🌹💝 (@jaggirm) December 9, 2024
JUNGLE AMBOREE restaurant people jumped to save their lives pic.twitter.com/8lalKwhqbq
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించనప్పటికీ, రెస్క్యూ ఆపరేషన్‌లో ఒక వ్యక్తికి కాలిన గాయాలు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. అతను చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది త్వరగతిన మంటలను అదుపులోకి తేవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. మంటలు ఎలా ప్రారంభమయ్యాయనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ | రైతులపైకి మళ్లీ టియర్‌గ్యాస్.. 8 మందికి గాయాలు.. శంభు బార్డర్ వద్ద ఉద్రికత్త