
రాజేంద్రనగర్ హైదర్ గూడలోని ఓ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అపార్ట్‌మెంట్ వాసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. అపార్ట్‌మెంట్ లో పని ఫైర్ పరికరాలు పనిచేయకపోవడంతో చాలా కష్టం మీద మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. సమయానికి ప్లాట్ లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదం.