మూసాపేట, వెలుగు : ఐడీపీఎల్ కాలనీలో ని ఏటు ఏ లైఫ్ స్పేస్ అపార్ట్ మెంట్లో ఆది వారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. బ్లాకు ఏ ఫ్లాట్ నెం. 806 లో మంటలు చెలరేగాయి.
దీంతో ఏం జరుగుతుందో తెలియక అపార్ట్ మెంటు వాసులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అపార్ట్ మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
