బంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 69 మంది సజీవ దహనం కాగా…. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢాకాలోని చౌక్ బజార్ లో అర్ధరాత్రి అపార్టుమెంట్ లో గ్యాస్ సిలిండర్ పేలిం.ది అయితే పక్కనే కెమికల్ వేర్ హౌజ్ కూడా ఉండటంతో… చుట్టూ ఉన్న భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో 69 మంది సజీవదహనం అయ్యారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని లోకల్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
