
హైదరాబాద్ : ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగిన సంఘటన ఆదివారం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. కారు గచ్చిబౌలి వైపు వెళ్తుండగా చిన్న గోల్కొండ స్ట్రెచ్ వద్దకు రాగానే కారులో పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ వెంటనే కారులో ఉన్నవారిని కిందకు దింపాడు. నిమిషాల్లోనే కారు మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. సమాచారం అందుకున్న మహేశ్వరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసింది. కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నట్లు తెలిపాడు డ్రైవర్.