
జీడిమెట్ల, వెలుగు : ప్లై వుడ్గోదాంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం ద్వారకానగర్ వద్ద నేమారం చౌదరీ అనే వ్యక్తి చౌదరీ ఫ్లైవుడ్పేరుతో దుకాణం నడుపుతున్నాడు.
దీనికనుబంధంగా ఓ గోదాం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం గోదాంలో మంటలు చెలరేగాయి. దీంతో ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలు, దట్టమైన పొగతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో స్పందించిన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.