విమానం ఇంజన్ లో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలెట్

విమానం ఇంజన్ లో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలెట్

శంషాబాద్ విమానాశ్రయ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి కౌలాలంపూర్‌ వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పైలెట్ అప్రమత్తమై విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాడింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లో వెళ్తే..  గురువారం ఉదయం మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కౌలాలంపూర్‌ బయల్దేరింది.

 విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన 15 నిమిషాలకు విమానం కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. మంటలు గమనించిన పైలట్‌ ల్యాండింగ్‌ కోసం అనుమతి కోరారు.ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చింది. చివరకు విమానం సేఫ్‌గా ల్యాండ్‌ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సహా విమానంలో 130 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు.