
బర్గర్షాప్లో అగ్నిప్రమాదం జరిగిన ఘటన జూబ్లీహిల్స్ లో ఆగస్టు 27న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్ నంబర్ 26 లో బిగ్గీస్ బర్గర్ షాప్ఉంది. షాపులో షార్ట్సర్య్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి.
కొన్ని క్షణాల్లో షాపు మొత్తానికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. షాపు పక్కనే పెట్రోల్ బంకు ఉండటంతో దానిని తాత్కాలికంగా మూసివేయించారు.
అనంతరం ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ప్రమాదంలో స్వల్ప ఆస్తి నష్టం జరగ్గా, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.