Kannappa OTT Release : మంచు విష్ణు 'కన్నప్ప' ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Kannappa OTT Release : మంచు విష్ణు 'కన్నప్ప' ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు గా రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప '.  జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది.  ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ నటీనటులు నటించడం సినిమాకు మరింత హైప్ తెచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. 

ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధం..
అయితే ఈ మూవీ విడుదలై రెండు నెలల దాటినా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు.  దీంతో ఎప్పుడొస్తుందా అని ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ'కన్నప్ప' చిత్రం OTT రిలీజ్ డేట్‌ను మంచు విష్ణు లేటెస్ట్ గా ప్రకటించారు. ఈనెల 4వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఈ సినిమా సంయుక్తంగా నిర్మించారు.

కథా నేపథ్యం
పరమ నాస్తికుడుగా పెరిగిన తిన్నడు (మంచు విష్ణు) జీవితం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తన తండ్రి నాథ నాథుడు (శరత్‌ కుమార్‌) మాటకు విలువ ఇచ్చే తిన్నడు, గూడెం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటాడు. పక్క గూడెం యువరాణి నెమలి (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. ఒక సందర్భంలో వాయు లింగం కోసం వచ్చిన కాల ముఖుడు (అర్పిత్ రాంకా) సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు. ఈ క్రమంలో గూడెంను వీడాల్సి వస్తుంది.

నెమలితో కలిసి అడవికి వెళ్తాడు తిన్నడు. నెమలి శివ భక్తురాలు కాగా, తిన్నడు మాత్రం శివుడిని నమ్మని నాస్తికుడు. అటువంటి తిన్నడి జీవితంలోకి రుద్ర (ప్రభాస్) ఎందుకు వచ్చాడు? శివరాత్రి రోజు ఏం జరిగింది? వాయు లింగం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? పరమ నాస్తికుడైన తిన్నడు చివరకు శివుడికి పరమ భక్తుడైన కన్నప్పగా ఎలా మారాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. థియేటర్లలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి.