
యాదాద్రి భువనగిరి జిల్లా: ఏపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి గురించి తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ కపుల్ అయిన వీళ్లు సోమవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అంతేకాదు.. దేవస్థాన అన్నప్రసాద వితరణకు 25 వేల రూపాయలు విరాళం అందజేశారు. టెక్కలి వైసీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన దువ్వాడ శ్రీను.. టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయారు.
దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి పేర్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దివ్వెల మాధురి ఇన్స్టాగ్రాం వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఆ వీడియోలను మీడియా ప్రసారం చేసింది. ఆమె ఇంటర్వ్యూ వీడియోలు ట్రెండ్ అయ్యాయి. దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురి గురించి వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలాయి.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇంటి ముందు ఆయన భార్య వాణి, కుమార్తెలు నవీన, హైందవి ఆగస్ట్ 8, 2024న నిరసనకు దిగడంతో ఇంటి రచ్చ రోడ్డున పడింది. కొత్తగా కట్టుకున్న ఆ ఇంట్లో దివ్వెల మాధురితో కలిసి దువ్వాడ శ్రీను ఉంటున్నాడని, తమ ఇంటికి రావడం లేదని ఆయన భార్య, కుమార్తెలు నిరసనకు దిగారు. దువ్వాడ శ్రీను ఇంటికి రావాలని కోరారు. అందుకు దువ్వాడ శ్రీను అంగీకరించకపోవడం, దివ్వెల మాధురి ఈ వివాదంపై మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఈ గొడవ మీడియాలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ALSO READ : తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఈ ఎనిమిది నెలల్లో..
దివ్వెల మాధురి హైదరాబాద్ సిటీలోని మదీనాగూడలో ఈ మధ్య వస్త్ర దుకాణం కూడా ప్రారంభించింది. ఈ వస్త్ర దుకాణం ప్రమోషన్స్ను స్వయంగా దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ భుజాలకెత్తుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఈ దుకాణంలో ఆఫర్లు, డిస్కౌంట్స్పై ఇన్ స్టాగ్రాంలో వీడియోలు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి గతంలో మాదిరిగానే ఈ జంట ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ ఇద్దరి బంధాన్ని విమర్శించే వాళ్లతో పాటు సమర్థించే వాళ్లు కూడా ఉండటం కొసమెరుపు.