
సింహాద్రి అప్పన్న ఉద్యోగులు తమ చేతివాటం చూయించారు. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం నుంచి ఏకంగా 50 వేల రూపాయలు మాయం చేశారు. హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఇద్దరినీ.. ఒకరు పర్మినెంట్ ఉద్యోగి రమణ, మరొకరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్ గా గుర్తించారు.
హుండీలో డబ్బు మాయం చేసిన ఉద్యోగుల గురించి తెలుసుకున్న ఆలయ పరిపాలన విభాగ AEO రమణమూర్తి.. గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్మనెంట్ ఉద్యోగిని సస్పెండ్ చేశారు ఈవో త్రినాథరావు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.