బీఆర్ఎస్ ఉంటే ఎంత.. పోతే ఎంత : ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఉంటే ఎంత.. పోతే ఎంత : ఎమ్మెల్సీ కవిత
  • హరీష్, సంతోష్ అవినీతి అనకొండలు
  • మా నాన్నను అడ్డు పెట్టుకొని ఆస్తులు పెంచుకున్నరు
  • వాళ్లపై డైరెక్టుగా ఎంక్వైరీ వేస్తే నిజాలు బయటికొస్తయ్
  • వాళ్లిద్దరి వెనుక సీఎం రేవంత్ రెడ్డి
  • సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే తోలు తీస్తా ఖబడ్డార్ బిడ్డా.. మీ సంగతి తేలుస్తం 
  • సీబీఐ ఎంక్వైరీ వేస్తే తెలంగాణ బంద్ కు పిలుపెందుకు ఇవ్వలే 
  • అలాంటి పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత..?
  • కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటికొస్తరు
  • విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత 
  • ప్రెస్ మీట్ లోనే కన్నీరు పెట్టిన ఎమ్మెల్సీ

బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. కేటీఆర్ ను టార్గెట్ చేసి ఎమ్మెల్సీ కవిత విమర్శలకు దిగుతున్నారని.. అన్నా చెల్లెలి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని వీరిమధ్య ఉన్న వైరంపై చర్చలు సాగుతూ వస్తు్న్నాయి. ఈ సారి కవిత హరీష్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగటం సంచలనంగా మారింది. కాళేశ్వరంపై ప్రభుత్వం సీబీఐ విచారణకు వెళ్లే ఛాన్స్ ఉండటంతో.. కాళేశ్వరం అవినీతి అంతా హరీశ్ రావుదేనని తీవ్ర విమర్శలకు దిగారు. కేసీఆర్ పైనే సీబీఐ విచారణ అంటే.. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని సీరియస్ కామెంట్స్ చేశారు. 

సోమవారం (సెప్టెంబర్ 01) ప్రెస్ మీట్ నిర్వహించిన కవిత.. కేసీఆర్ లాంటి మహానేతపై సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పై సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చింది అంటే పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత..? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇండి పెండెంట్ గానే ఉంటానని అన్నారు. తాను డైరెక్టుగా చెప్పిన వారిపై ఎంక్వైరీ చేయాలని అసలు నిజాలు బయటికి వస్తాయని అన్నారు. 

బీహార్ ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బీసీలను బలి చేస్తున్నారని ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణను ప్రచారాస్త్రంగా వాడుకో నేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రి జర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. బీసీలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ కు వ్యతిరేకంతా జాగృతి ఆధ్వర్యంలో తాము బీహార్ లో ప్రచారంచేస్తామని కవిత చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి హరీశ్ రావు, సంతోష్ రావు అవినీతి అనకొండలని, తనతండ్రి కేసీఆర్ దేవుడి లాంటి వారని ఎమ్మె ల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనపై సోషల్ మీడియాలో అడ్డగో లు రాతలు రాయిస్తున్న హరీశ్, సంతోష్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ఆరోపించారు. వాళ్లకు బ్యాచ్ లు ఉన్నాయని అన్నారు. తాను భయపడబోనంటూ హరీశ్, సంతోష్ లకు కవిత సవాలు విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ చేస్తున్నట్టు ప్రకటిస్తే తెలంగాణ బంద్ కు ఎందుకు పిలుపు ఇవ్వలేదని ప్రశ్నించారు. 

కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతో చేశారని అన్నారు. ఆయనకు తిండిమీద కూడా ధ్యాన ఉండదని అన్నారు.. దేవుడి లాంటి తన తండ్రిపై సీబీఐ ఎంక్వైరీ వేయిస్తారంటే తన కడుపు రగులుతోందని చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో తెలంగాణ తెచ్చిన ధీరుడిగా ఉన్న తన తండ్రి పేరుకు మచ్చ తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కేసీఆర్ అంటే సీబీఐ కేసా అని అందరూ అంటారని అన్నారు. తన తండ్రి పరువు పోతే తమ ఇజ్జత్ కూడా పోతుందని అన్నారు. కేసీఆర్ మీద ఎంక్వైరీ వేస్తే పార్టీ -స్పందించదా..? అని ప్రశ్నించారు. తొక్కలో ఎలక్షన్ ఒకటి పోతే పోతది కావచ్చునని, పరువు ముఖ్యమని కవిత ఆవేదన చెందారు. 

విచారణల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం టైంపాస్ చేస్తోందని అన్నారు. పీసీ ఘోష్ కమిషన్ వేసిన ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణకు అప్పగించడం ఏమిటని ప్రశ్నిం చారు. హరీష్ రావు, సంతోష్ రావు వలన కేసీఆర్ సీబీఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ను అడ్డుపెట్టుకుని హరీష్ రావు, సంతోష్ రావు సొంత ఆస్తులు, వనరులు పెంచు కున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ వాళ్ళను భరిస్తున్నారని అన్నారు.

మేజర్ పాత్ర హరీశ్ దే

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో హరీష్ రావుది మేజర్ పాత్ర అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ పరిస్థితులకు మేఘా కృష్ణారెడ్డి, హరీశ్ రావు, సంతోష్ కారణమని అన్నారు. కేసీఆర్ కు తెలంగాణ ధ్యాస మాత్రమే ఉంటుందని, ఆయన ప్రజల విషయాలు తప్ప.. పర్సనల్ విషయాలు మాట్లాడరని అన్నారు. కాళేశ్వరం కట్టిన కేసీఆర్ పేరు 200 ఏండ్లు చెప్పుకొంటారని అన్నారు. పక్క రాష్ట్ర అజెండాను అమలు చేసే వ్యక్తి రేవంత్ అని అరోపించారు.