కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫైర్ మాక్ డ్రిల్

కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఫైర్ మాక్ డ్రిల్

హైదరాబాద్​సిటీ, వెలుగు:  బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్​లో సోమవారం (June 9) ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు విభాగాలు కలిసి అగ్నిప్రమాద సమయంలో ఉద్యోగులను ఎలా కాపాడుకోవాలో డ్రిల్‌‌‌‌‌‌‌‌లో ప్రదర్శించారు. 

ఈ సందర్భంగా ప్రతి ఫ్లోర్‌‌‌‌‌‌‌‌కు ఫైర్ మార్షల్, అతనికి సహాయడిగా అసిస్టెంట్​ను నియమిస్తున్నట్లు ఐసీసీసీ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. ప్రతి నెల మొదటి శనివారం ఇలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామన్నారు. హైరైజ్​బిల్డింగ్స్​ల్లో అగ్ని ప్రమాదాలను తక్కువ అంచనా వేయొద్దని, లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లకు బదులు మెట్లు వాడాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు.