V6 News

ఫైర్ సేఫ్టీ చట్ట సవరణ ముసాయిదా సిద్ధం.. మే 13 లోగా ప్రజలు తమ అభిప్రాయ సేకరణ

ఫైర్ సేఫ్టీ చట్ట సవరణ  ముసాయిదా సిద్ధం.. మే 13 లోగా ప్రజలు తమ అభిప్రాయ సేకరణ

హైదరాబాద్‌‌, వెలుగు: అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాదాల సమయంలో ఆస్తి, ప్రాణ రక్షణ చర్యల బలోపేతం, ఫైర్ ఎన్‌‌వోసీ కోసం రాష్ట్ర ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌‌మెంట్‌‌చట్ట సవరణకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత బిల్డింగ్స్​నిర్మాణానికి అనుగుణంగా ఫైర్ సర్వీసెస్ చట్టం–1999కు సవరణ ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందులో మార్పులు చేర్పులపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని రాష్ట్ర ఫైర్ సర్వీసెస్‌‌ డీజీ విక్రమ్‌‌సింగ్‌‌ మాన్‌‌ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ ముసాయిదాను https://www.fire.telangana.gov.in,  https://www.telangana.gov.in  వెబ్‌‌సైట్లలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 

  • సూచనలు ఇలా పంపండి..

అభిప్రాయాలు, సూచనలు సెక్షన్ వారీగా తగిన కారణాలతో మే 13 సాయంత్రం 5 గంటలలోపు పంపించాలని డీజీ సూచించారు. ఇ–-మెయిల్ act-amend-fire@telangana.gov.in ద్వారా  Amendment feedback సబ్జెక్ట్‌‌తో పంపాలని పేర్కొన్నారు. లేఖ రూపంలో అయితే కవరుపై Suggestions on Amendment to Fire Services Act 1999 అని రాసి,  డైరెక్టర్ జనరల్, తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్, సర్వే నంబర్​115/16(P), 115/17, IRDAI కాంప్లెక్స్ పక్కన, నానక్‌‌ రామ్‌‌గూడ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్–500032 చిరునామాకు పంపించాలన్నారు.