స్కూల్‌‌‌లో పేలిన పటాకులు.. స్టూడెంట్లకు గాయాలు

స్కూల్‌‌‌లో పేలిన పటాకులు.. స్టూడెంట్లకు గాయాలు
  • మహబూబ్‌‌‌‌నగర్‌ రూరల్‌ మండలం రేగడిగడ్డతండా స్కూల్‌లో ఘటన

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ రూరల్‌‌‌‌, వెలుగు: స్కూల్‌‌‌‌లో పటాకులు పేల్చడంతో నలుగురు చిన్నారులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ రూరల్ మండలంలోని రేగడి గడ్డ తండా ప్రైమరీ స్కూల్‌‌‌‌లో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో స్కూల్‌‌‌‌కు వెళ్తున్న ఓ స్టూడెంట్‌‌‌‌కు మార్గమధ్యలో పటాకులు దొరుకగా.. వాటిని తీసుకొని స్కూల్‌‌‌‌కు వెళ్లాడు. తర్వాత రెండో తరగతి స్టూడెంట్లు వసంత్‌‌‌‌కుమార్‌‌, రుషిక, మానస, మనోజ్‌‌‌‌ కలిసి పటాకులను పేల్చారు.

దీంతో నలుగురికి గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు 108లో మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి శుక్రవారం సాయంత్రం హాస్పిటల్‌‌‌‌కు చేరుకొని చిన్నారులను పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.