దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ కార్నియా

దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ కార్నియా

హైదరాబాద్ కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి సంచలనాత్మక విజయం సాధించారు. కృత్రిమ 3డీ కార్నియాను ప్రింట్ చేసి కుందేలు కంటిలో అమర్చారు. ఈ ప్రక్రియను బంజారాహిల్స్ లోని ఎల్వీ ప్రసాద్ వైద్య, విజ్ఞాన సంస్థ, సీసీఎంబీ శాస్త్రవేత్తలు, ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు కలిసి సంయుక్తంగా పూర్తి చేశారు. అయితే మానవ కార్నియల్ కణజాలం నుంచి ఈ త్రీడీ ప్రింటెడ్ కార్నియాను అభివృద్ధి చేసినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇంకో ముఖ్య విషయమేమిటంటే.. ఇది దేశంలోనే మొదటిసారిగా భారతీయ వైద్యులు- శాస్త్రవేత్తలు తయారు చేయబడిన 3డీ ప్రింటెడ్ హ్యూమన్ కార్నియా.

ఈ త్రీ డీ ప్రింటెడ్ కార్నియాను తయారు చేయడానికి వాడే బయో ఇంక్... కార్నియాలో ఏర్పడ్డ రంధ్రాలను, యుద్ద సమయంలో కంట్లో వచ్చే ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ కృత్రిమ 3డీ ప్రింటెడ్ కార్నియాను కుందేలు కంటిలో అమర్చారు. దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరుగుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు.