
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఆవిష్కరించిన అద్భుత దృశ్య కావ్యం ‘అవతార్’కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. విజువల్ వండర్‌గా వచ్చిన ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు భాగాలు మెప్పించగా ఇప్పుడు మూడో భాగం రాబోతోంది. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. బ్రిటీష్ నటి ఊనా చాప్లిన్ పోషించిన ‘వరంగ్’ పాత్రను ఈ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. అలాగే ట్రైలర్‌ను జులై 25న ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ మూవీ విడుదలవుతున్న థియేటర్స్‌లో ప్రదర్శించబోతున్నట్టు ప్రకటించారు.
డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. మొదటి భాగాన్ని పండోర గ్రహంలోని ప్రకృతి అందాల మధ్య చూపించిన కామెరూన్.. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ పేరుతో రెండో భాగాన్ని నీటి మధ్య తెరకెక్కించాడు. ఇప్పుడు మూడో భాగం అగ్ని నేపథ్యంలో రాబోతోంది. 2029లో ‘అవతార్ 4’ , 2031లో ‘అవతార్ 5’ విడుదల కానున్నాయి.