
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎమ్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్(బీఎస్ఏ) అమల్లోకి వచ్చాయి. సోమవారం చార్మినార్ పీఎస్ పరిధిలో ఈ కొత్త చట్టాల ప్రకారం మొదటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది.
నంబర్ ప్లేట్ లేని వాహనదారుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 281, 80(ఏ), 177 మోటార్ వెహికల్( ఎంవీ) యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది వరకులా కాకుండా డిజిటల్ విధానంలో రిజిస్టర్ చేశారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా ఎఫ్ఐఆర్ను చూసుకునే అవకాశాలున్నాయి. మొట్టమొదటి కేసును నమోదు చేసిన విషయాన్ని డీజీపీ రవిగుప్తా ‘ఎక్స్’ పోస్ట్ చేసి వెల్లడించారు.